కృష్ణ పార్థివ దేహానికి నివాళ్లు అర్పించిన ఏపీ సీఎం జగన్
- November 16, 2022
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి ఏపీ సీఎం జగన్ నివాళ్లు అర్పించారు. ఉదయం విజయవాడ నుండి హైదరాబాద్ కు చేరుకున్న జగన్..పద్మాలయా స్టూడియోకి చేరుకొని నివాళ్లు అర్పించారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పలకరించారు. మహేష్ బాబు ను ఆలింగనం చేసుకొని ధైర్యం చెప్పారు. అక్కడే ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , గల్లా జయదేవ్ ను పలకరించారు.
ప్రస్తుతం పద్మాలయా స్టూడియోలో అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివ దేహాన్ని ఉంచారు. ఉదయం నుండి తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు అభిమానులు బారులు తీరారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాదు పక్క రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది అభిమానులు చేరుకొన్నారు. ఓ గొప్ప నటులను కోల్పాయామని వారంతా బాధపడుతున్నారు. అభిమానులతో పాటు సినీ స్టార్స్ సైతం కృష్ణ కు నివాళ్లు అర్పిస్తున్నారు.
కొద్దీ సేపటి క్రితం నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కృష్ణ పార్థివ దేహానికి నివాళ్లు అర్పించారు. అనంతరం మహేష్ తో మాట్లాడి ధైర్యం చెప్పారు. అలాగే డైరెక్టర్ శేఖర్ కమ్ముల , త్రివిక్రమ్, మెహర్ రమేష్ తదితరులు నివాళ్లు అర్పించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత పూజా కార్య క్రమాలు జరిపి, అంతిమ యాత్ర మొదలుపెడతారు. 3 గంటల ప్రాంతంలో మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ గారి అంత్యక్రియలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







