సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్
- November 16, 2022
హైదరాబాద్: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ మరో వివాదంలో చిక్కుకున్నారు. కరోనా నేపథ్యంలో మీడియా ముందుకు వస్తూ ప్రజలకు జాగ్రత్తలు చెపుతూ సుపరిచితమైన శ్రీనివాస్..ఆ మధ్య ఓ విచిత్రమైన పూజలు పాల్గొని వార్తల్లో నిలిచారు. గత కొంత కాలంగా కొత్తగూడెం, ఖమ్మం పరిధిలో పర్యటిస్తూ మీడియాలో నిలుస్తున్న అయన..తాజాగా సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కతూ మీడియా లో వైరల్ గా మారారు.
గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటూ…వస్తున్న శ్రీనివాస రావు.. కేసీఆర్ కాళ్లు మొక్కతు కనబడటం హాట్ టాపిక్‌గా మారింది. నిన్న టీఆర్ఎస్ భవన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనపై మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి స్పందించారు. కొత్తగూడెం అసెంబ్లీ టిఆర్ఎస్ టికెట్ గురించే కదా Dr శ్రీనివాస్ CM కాళ్ళు పట్టుకోడమంటూ చురకలు అంటించారు. మీలాంటి అధికారులు బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారని నిప్పులు చెరిగారు. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు చూసా టౌన్ మొత్తం మీ ఫ్లెక్సీలే. పదవి మిస్యూస్ చేస్తూ కొత్తగూడెం లో ఎదో కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నాతో అన్నారంటూ కేసీఆర్ కాళ్లు మొక్కిన వీడియోను షేర్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







