బిగ్‌బాస్ లూటీ.! ప్రైజ్ మనీ అంతా దోచేస్తున్నాడుగా.!
- November 16, 2022
బిగ్‌బాస్ సీజన్ 6 విన్నింగ్ ప్రైజ్ మనీని ఇచ్చే వుద్దేశ్యం లేదనుకుంటా ఈ సారి బిగ్‌బాస్‌కి. ఎప్పుడూ లేని విధంగా టాస్కులకు ప్రైజ్ మనీతో లింకులు పెట్టేస్తున్నాడు. లింకులు పెడితే పెట్టాడు. టాస్క్‌ల్లో ఫెయిలైనా, పాసైనా ప్రైజ్ మనీలో కోతలు విధిస్తున్నాడు.
తాజాగా ఇమ్యూనిటీ పేరుతో బిగ్‌బాస్ పెట్టిన టాస్క్ బిగ్‌బాస్ వీక్షకుల్ని విస్మయానికి గురి చేస్తోంది. డ్రాప్ బాక్స్, చెక్ డిపాజిట్.. అంటూ ఓ విచిత్రమైన టాస్క్ పెట్టాడు తాజాగా బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో హయ్యెస్ట్ యూనిక్ అమౌంట్‌ని డ్రాప్ బాక్స్‌లో వేసిన వారికి ఈ వారం ఎలిమినేషన్ నుంచి ఇమ్యూనిటీ వస్తుందని చెప్పాడు.
అంతా బాగానే వుంది. ఏ ఇద్దరూ సేమ్ అమౌంట్ వేసినా వారు ఇమ్యూనిటీ దక్కించుకోలేరు. అలా రాజ్ డిఫరెంట్ హయ్యెస్ట్ యూనిక్ అమౌంట్ వేయగా, అతనికి ఇమ్యూనిటీ దక్కింది. ప్రైజ్ మనీ పోయింది. అదేనండీ, ఆయన ఎంత అమౌంట్ అయితే, డ్రాప్ బాక్స్‌లో వేశాడో ఆ అమౌంట్, ఒకవేళ బిగ్‌బాస్ విన్నర్ అయితే వచ్చే ప్రైజ్ మనీ నుంచి ఆ అమౌంట్ కట్ చేసి ఇచ్చేలా ఈ టాస్క్ డిజైన్ చేశాడు.
ఈ టాస్క్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. 20 మంది సభ్యులతో స్టార్ట్ అయిన ‘బిగ్’ హౌస్, ప్రస్తుతం 10 మంది ఇంటి సభ్యులతో రన్ అవుతోంది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







