హైదరాబాద్ విమానాశ్రయం నుంచి లుఫ్తాన్సా కార్గో ఫ్రైటర్ సర్వీసులు పున:ప్రారంభం

- November 16, 2022 , by Maagulf
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి లుఫ్తాన్సా కార్గో ఫ్రైటర్ సర్వీసులు పున:ప్రారంభం
  • ఫ్రాంక్‌ఫర్ట్-ముంబై-హైదరాబాద్-ఫ్రాంక్‌ఫర్ట్‌లను కనెక్ట్ చేయనున్న లుఫ్తాన్సా ఫ్రైటర్
  • వియత్నాంలోని హనోయ్‌కు స్పైస్‌ఎక్స్‌ప్రెస్ ఫ్రైటర్ సర్వీసులు ప్రారంభం
     

హైదరాబాద్: లుఫ్తాన్సా కార్గో ఇటీవల GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సరుకు రవాణా సేవలను పున:ప్రారంభించింది. లుఫ్తాన్సా కార్గో ఫ్రాంక్‌ఫర్ట్-ముంబై-హైదరాబాద్-ఫ్రాంక్‌ఫర్ట్‌లను కలుపుతూ బోయింగ్ 777 ఫ్రైటర్‌ను నడుపుతోంది. ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం తర్వాత లుఫ్తాన్సా తన ఫ్రైటర్ కార్యకలాపాలను ప్రారంభించింది.

హైదరాబాద్ భారతదేశపు "బల్క్ డ్రగ్ క్యాపిటల్"గా పరిగణించబడుతోంది. లుఫ్తాన్సా ఫ్రైటర్ సర్వీస్ పునఃప్రారంభం వల్ల కార్గో కనెక్షన్‌లు పెరగడమే కాకుండా హైదరాబాద్‌లోని ఫార్మా సంస్థలు యూరప్, అమెరికాలో పెరుగుతున్న మార్కెట్‌లను సులభంగా చేరుకోగలుగుతాయి. కోవిడ్‌కు ముందు, FY2019-20లో లుఫ్తాన్సా కార్గో వార్షిక ఎగుమతి సుమారు 6500 మెట్రిక్ టన్నులు, దిగుమతులు 1500 మెట్రిక్ టన్నులు. ఈ ఫ్రైటర్ సర్వీస్ మరోసారి ఎలాంటి ఆటంటకాలూ లేని అంతర్జాతీయ కనెక్టివిటీని అందిస్తుంది. యూరప్, అమెరికాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది.

లుఫ్తాన్సా కార్గోతో పాటు స్పైస్‌జెట్ యొక్క కార్గో విభాగం స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ కూడా ఇటీవలే HYD నుండి హనోయికి తన ఫ్రైటర్ సేవలను ప్రారంభించింది. ఇది ఆగ్నేయ ఆసియాలో పెరుగుతున్న మార్కెట్‌కు కార్గోను తీసుకెళ్లడానికి సహాయపడుతుంది.

GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ CEO ప్రదీప్ పణికర్, "హైదరాబాద్ విమానాశ్రయం నుండి లుఫ్తాన్సా ఫ్రైటర్ సేవలను పునఃప్రారంభించడం వల్ల అమెరికా, యూరప్ మార్కెట్‌లను కలిపే కనెక్టివిటీ పెరిగి తద్వారా కార్గో సేవలు పెరుగుతాయి. హనోయికి స్పైస్‌ఎక్స్‌ప్రెస్ ఫ్రైటర్ ప్రారంభం కావడం కూడా మాకు ఆనందం కలిగించే విషయం. ఈ కార్గో మార్గాలు హైదరాబాద్ ప్రాంతంలో కార్గో వ్యాపారాన్ని మరింతగా పెంచుతాయి. కోవిడ్ తర్వాత సాధారణ స్థితికి రావడంతో, మేము ప్రపంచవ్యాప్తంగా కొత్త కార్గో మార్గాలను జోడించే ప్రక్రియలో ఉన్నాము, త్వరలో అనేక ఇతర ఫ్రైటర్  సేవలు ప్రారాంభం కావాలనేది మా ఆకాంక్ష. ప్రపంచవ్యాప్తంగా, సరఫరా గొలుసు అనేక అంతరాయాలను ఎదుర్కొంటోంది. హైదరాబాద్ కార్గో మార్కెట్‌కు దీర్ఘకాలిక అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి." అన్నారు.

సాకేత్ గుప్తా, హెడ్–సేల్స్ అండ్ హ్యాండ్లింగ్- సెంట్రల్ అండ్ సదరన్ ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్, లుఫ్తాన్సా కార్గో, ‘‘మా కస్టమర్లకు మరోసారి 777ఎఫ్ కెపాసిటీని ఆఫర్ చేయగలుగుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా భాగస్వామి జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మా కృతజ్ఞతలు’’’ అన్నారు.

GMR హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ కార్గో ఫార్మా, పెరిషబుల్, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఏరోస్పేస్ మరియు లెదర్ పరిశ్రమలలో అనేక బహుళజాతి కంపెనీలకు సేవలు అందిస్తోంది. భారతదేశంలోని అన్ని ప్రధాన కార్గో హబ్‌లతో పాటు, ఫ్రాంక్‌ఫర్ట్, ఇస్తాంబుల్, దుబాయ్, దోహా మరియు హాంకాంగ్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలు కూడా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అనుసంధానించబడ్డాయి.

 హైదరాబాద్ విమానాశ్రయం ఆధునిక, ప్రపంచ స్థాయి ఎయిర్ కార్గో టెర్మినల్‌ను కలిగి, ఉష్ణోగ్రత నియంత్రిత ఫార్మా సరుకుల నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంది. అధునాతన భద్రతా స్క్రీనింగ్, కార్గో హ్యాండ్లింగ్ సిస్టమ్‌లతో సహా అన్ని సపోర్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు పరికరాలను కలిగి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com