‘మైత్రి’లో బాలయ్య వెర్సస్ చిరంజీవి.!
- November 16, 2022
ఈ ఏడాది సంక్రాంతి పోరు హోరా హోరీగా వుండేలా వుంది. ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’గా, నందమూరి నటసింహం బాలయ్య ‘వీర సింహారెడ్డి’గా ధియేటర్లలో సందడి చేయబోతున్నారు.
ఇరు హీరోల ఫ్యాన్స్‌కీ ఇది అసలు సిసలు సంక్రాంతి పండగగా చెప్పుకోవచ్చు. ట్విస్ట్ ఏంటంటే, ఈ రెండు సినిమాలూ ఒకే బ్యానర్లో రూపొందాయి. అదే మైత్రీ మూవీస్ బ్యానర్. అలాగే, రెండు సినిమాల్లోనూ హీరోయిన్ కూడా ఒక్కరే. ఆమె ఎవరో కాదు, శృతి హాసన్.
టైటిల్స్ నుంచి నిర్మాణం వరకూ చాలా పోలికలున్నాయ్ ఈ రెండు సినిమాల విషయంలో. అయితే, ‘ఆచార్య’ ఫెయిల్యూర్ తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సినిమా ఇది. ‘అఖండ’ విజయం తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా ఇది.
దాంతో, మెగాస్టార్ చిరంజీవి సినిమా కన్నా, బాలయ్య సినిమాకే ఎక్కువ స్కోప్ వుందనీ, చిరంజీవి సినిమాని ఎవరూ కొనేందుకు కూడా ముందుకు రావడం లేదనీ బాలయ్య ఫ్యాన్స్ గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు సేమ్ బ్యానర్, సేమ్ హీరోయిన్ అంటే, పబ్లిసిటీ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలున్నాయి.
ఈ ఈ సమస్యలను అవకాశంగా తీసుకుని కొందరు నెగిటివ్ వీరులు తమకు తోచిన విధంగా నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు. హీరోలైన చిరంజీవి, బాలయ్య బాగానే వుంటారు. మధ్యలో వీరి అత్యుత్సాహమే కొంప ముంచేస్తుంటుంది. ఈ గాసిప్ వీరుల అత్యత్సాహాన్ని కంట్రోల్ చేసే బాథ్యత మైత్రీ వాళ్లదే. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజా వార్తలు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్‌లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్‌పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!
- ఐసీఆర్ఎఫ్ సమ్మర్ డ్రైవ్.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు..!!
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు







