పాపం.! త్రివిక్రమ్ టైమ్ బాగాలేదు.!
- November 16, 2022
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు గడుస్తోంది. అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత త్రివిక్రమ్ నుంచి సినిమా రాలేదు.
ఎన్టీయార్‌తో సినిమా అనుకున్నాడు కానీ, అది కుదరలేదు. మహేష్‌తో ఇటీవలే సినిమాని పట్టాలెక్కించాడు. ఓపెనింగ్ బాగానే వుంది. ఫస్ట్ షెడ్యూల్ రాకెట్ స్పీడుతో కానిచ్చేశాడు. ఆ వేగం చూసి, షూటింగ్ మొత్తం అదే స్పీడులో పూర్తి చేసేస్తారనుకున్నారు అభిమానులు.
కానీ, అనుకోకుండా మహేష్ తల్లి ఇందిరమ్మ మరణం సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చేసింది. ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుంచి కోలుకుంటున్న మహేష్ ఇక త్వరలోనే సెకండ్ షెడ్యూల్‌కి సిద్ధమవుతాడనుకుంటున్న టైమ్‌లో తండ్రి హఠాన్మరణం.. మహేష్‌ని ఇంకా కుంగదీసింది.
దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఈ బాధ నుంచి మహేష్ కోలుకోవడానికి ఇంకెంత టైమ్ పడుతుందో చెప్పలేని పరిస్థితి. పాపం త్రివిక్రమ్ టైమ్ బ్యాడ్. అనుకున్న టైమ్‌కి సినిమాని పూర్తి చేయగలడో లేదో ప్రస్తుతానికి సస్పెన్సే.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







