మొన్న నయన్, ఇప్పుడు హన్సిక.! ఓటీటీకి ‘పెళ్లి’ పండగ.!
- November 16, 2022
సెలబ్రిటీల ముచ్చట్లన్నీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారానే ఫ్యాన్స్‌కి రవాణా చేస్తుంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రొషిషనల్ నుంచి పర్సనల్ ఇష్యూస్ వరకూ నెట్టింటి ద్వారానే బయటికి వచ్చేది.
ఇక, ప్రేమలూ, పెళ్లిళ్లకి సంబంధించిన ఇష్యూస్ కూడా అంతే. తాజాగా ఓ హీరో తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాలో వెడ్డింగ్ కార్ట్ పోస్ట్ చేయడం ద్వారానే కన్‌ఫామ్ చేశాడు.
అలాగే, ‘దేశముదురు’ భామ హన్సిక కూడా అంతే, తనకు కాబోయే వరుణ్ని సోషల్ మీడియా ద్వారానే పరిచయం చేసింది. వచ్చే నెలలో హన్సిక పెళ్లి పీటలెక్కబోతోందన్న సంగతి తెలిసిందే.
డిశంబర్ 4న తన చిన్ననాటి స్నేహితుడు సోహైల్‌ని హన్సిక వివాహమాడబోతోంది. జైపూర్‌లోని ఓ పురాతన ప్యాలెస్‌లో హన్సిక వివాహం ఘనంగా జరగనుంది. ఈ వివాహ వేడుక వీడియో రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ ఛానెల్ నెట్‌ఫ్లిక్స్‌కి భారీ మొత్తానికి అమ్మేసిందని ప్రచారం జరుగుతోంది.
గతంలో నయనతార, విఘ్నేష్ శివన్ తమ వివాహ వేడుక వీడియోని కూడా ఇలాగే, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఛానెల్‌కి భారీ మొత్తంలో అమ్మేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్‌లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్‌లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!







