ప్యారిస్ ఒప్పందంపై బహ్రెయిన్ సంతకం
- April 23, 2016
గ్లోబల్ వార్మింగ్ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉందని బహ్రెయిన్ అభిప్రాయపడింది. వాతావరణ మార్పులపై చారిత్రాత్మకమైన ప్యారిస్ ఒప్పందంపై బహ్రెయిన్ - వరల్డ్ హెల్త్ డే సందర్భంగా సంతకం చేసింది. కింగ్ వ్యక్తిగత ప్రతినితి షేక్ అబ్దుల్లా బిన్ హమాద్ అల్ ఖలీఫా ఈ ఒప్పందంపై సంతకం చేశారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఇందుకు వేదికయ్యింది. చైనా, అమెరికా కూడా ప్యారిస్ క్లైమేట్ డీల్‌పై సంతకం చేశాయి. 175 దేశాలకు చెందిన ప్రతినిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్, ఈ ఒప్పందంపై తొలి సంతకం చేశారు. 2020 డెడ్‌లైన్‌గా విధించినప్పటికీ, అంతకన్నా ముందే ప్రపంచంలోని అన్ని దేశాలూ ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తాయని అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ మానవాళికి ముప్పుగా పరిణమించడంతో, ప్రతి దేశం తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, అలాగే పర్యావరణంపై ఉమ్మడి పోరు అవసరమని ఈ సందర్భంగా వివిధ దేశాల ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







