ఒమన్‌కు సమీపంలో ఆయిల్ ట్యాంకర్ ని ఢీకొట్టిన డ్రోన్..
- November 17, 2022
ఒమన్: ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతల నెలకొన్న నేపథ్యంలో ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ ను బాంబు మోసుకెళ్తున్న డ్రోన్ ఢీకొట్టింది. అయితే, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. దాడికి గురైన నౌకను లైబీరియన్ జెండాతో కూడిన ఆయిల్ ట్యాంకర్ పసిఫిక్ జిర్కాన్గా అధికారులు గుర్తించారు. ట్యాంకర్‌ను సింగపూర్‌కు చెందిన ఈస్టర్న్ పసిఫిక్ షిప్పింగ్ నిర్వహిస్తోంది. ఇది ఇజ్రాయెలీ బిలియనీర్ ఇడాన్ ఆఫర్ యాజమాన్యంలో ఉంది. 2019 నుంచి యూఏఈ తీరంలో జరుగుతున్న వరుస దాడులకు ఇరాన్ కారణమని పలు సందర్భాల్లో అమెరికా ఆరోపించింది. అణు ఒప్పందం నుండి యుఎస్ ఏకపక్షంగా వైదొలగిన తర్వాత టెహ్రాన్ తన అణు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసినట్లు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే