విశ్వక్ సేన్ ‘ధమ్‌కీ’ న్యూ అప్‌డేట్.!
- November 17, 2022
వివాదాల నటుడిగా పేరు తెచ్చుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజా మూవీ ‘ధమ్‌కీ’కి సంబంధించి కొత్త అప్డేట్ రిలీజ్ చేశారు మేకర్లు. ఈ సినిమాకి మేకర్స్ ఎవరో కాదు, విశ్వక్ సేనుడే. అవునండీ. కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే.
ఓన్ డైరెక్షన్‌లో ఈ సినిమాలో నటిస్తున్నాడు విశ్వక్ సేన్. సొంత బ్యానర్ వన్ మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్‌లో ఈ సినిమాని తానే నిర్మిస్తున్నాడు. ఎలాగూ హీరో ఆయనే.
కొరియోగ్రఫీలోనూ ఆయన హస్తం వుందట. ఇలా అన్నీ తానే అయ్యి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు విశ్వక్ సేన్. ఫిబ్రవరి 20న ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశాడు విశ్వక్ సేనుడు.
ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో ‘పాగల్’ సినిమా కోసం ఈ ఇద్దరూ జోడీ కట్టిన సంగతి తెలిసిందే.
ఇక, ఇటీవలే సీనియర్ నటుడు అర్జున్ డైరెక్షన్‌లో ఓ సినిమాకి కమిట్ అయ్యి లాస్ట్ మినిట్‌లో హ్యాండిచ్చి వివాదాల్ల్లోకి ఎక్కాడు విశ్వక్ సేన్. అలాగే, ‘ఓరి దేవుడా’ సినిమాతో రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత వారం నుంచీ ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించే పనిలో బిజీగా వుంది. ధియేటర్‌లో ఫెయిలైన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా ఎంటర్‌టైన్ చేస్తోంది.
తాజా వార్తలు
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..