ఆన్‌లైన్ నుసుక్ యాత్రికుల సేవను ప్రారంభించిన సౌదీ హజ్ మంత్రి

- November 18, 2022 , by Maagulf
ఆన్‌లైన్ నుసుక్ యాత్రికుల సేవను ప్రారంభించిన సౌదీ హజ్ మంత్రి

మక్కా: యాత్రికుల కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ ‘నుసుక్’ను అధికారికంగా ప్రారంభించినట్లు సౌదీ అరేబియా హజ్- ఉమ్రా మంత్రి తౌఫిక్ అల్-రబియా ప్రకటించారు. విజన్ 2030 లక్ష్యాలలో భాగంగా సౌదీ అరేబియాను సందర్శించే యాత్రికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడే ప్లాట్‌ఫారమ్ నుసుక్ 100 కంటే ఎక్కువ సేవలను అందజేస్తుందన్నారు. నుసుక్ వ్యాపారాలకు 75 సేవలను, వ్యక్తులకు 45 సేవలను అందిస్తున్నట్లు అల్-రబియా తెలిపారు. వ్యాపార రంగంలోని 10,000 కంటే ఎక్కువ సంస్థలు, 25 ప్రభుత్వ సంస్థల సహకారంతో ఇది 30 మిలియన్లకు పైగా ప్రజలకు సహాయం చేస్తుందని ఆయన తెలిపారు. టూరిజం మంత్రిత్వ శాఖ, సౌదీ టూరిజం అథారిటీ సహకారంతో నిర్వహిస్తున్న విజన్ 2030 యాత్రికుల అనుభవ కార్యక్రమంలో నుసుక్ భాగమని ఆయన చెప్పారు. ఉమ్రా చేసే అన్ని దశలలో మక్కా-మదీనాలోని చారిత్రక ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలకు యాత్రికులను పరిచయం చేయడమే ఈ వేదిక లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com