బహ్రెయిన్ ఎన్నికల్లో ఓటు వేసిన 494 మంది కొవిడ్ రోగులు

- November 18, 2022 , by Maagulf
బహ్రెయిన్ ఎన్నికల్లో ఓటు వేసిన 494 మంది కొవిడ్ రోగులు

బహ్రెయిన్: కోవిడ్-19 వైరస్ సోకిన 494 మంది పౌరులు కొత్త పార్లమెంట్, మునిసిపల్ కౌన్సిల్‌లను ఎన్నుకోవడానికి జరిగిన మొదటి రౌండ్ పోల్స్‌లో ఓటు వేశారు. ఈ విషయాన్ని లెజిస్లేషన్ అండ్ లీగల్ ఒపీనియన్ కమిషన్ అధిపతి, పార్లమెంటరీ, మున్సిపల్ ఎలక్షన్స్ 2022 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాఫ్ అబ్దుల్లా హమ్జా వెల్లడించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహకారంతో కొవిడ్ సోకిన వారి కోసం ఓటింగ్ ప్రక్రియ విజయవంతంగా అమలు చేయబడిందని ఆయన వివరించారు. కోవిడ్-19 సోకిన వ్యక్తులకు నవంబర్ 19న జరగనున్న రన్‌ఆఫ్‌లలో కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు.

ఈ సంవత్సరం పార్లమెంట్ దిగువ సభ 40 స్థానాలకు 561 మంది, 30 స్థానాల మునిసిపల్ కౌన్సిల్‌లకు 176 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 2018తో పోలిస్తే ఇది 20 శాతం అధికం. మొదటి రౌండ్ ఎన్నికలలో మొత్తం 252,256 మంది బహ్రెయిన్‌లు ఓటు వేశారు. మహిళల్లో 48 శాతం పోలింగ్ నమోదైంది. బహ్రెయిన్ 2022 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2002లో జరిగిన మొదటి ఎన్నికల తర్వాత అత్యధికం. 2022 ఎన్నికలలో ఓట్లు వేయడానికి అర్హులైన బహ్రెయిన్‌ల సంఖ్య 344,713గా ఉన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com