ప్రేమించినవాడితో ఘనంగా అమీర్‌ఖాన్ కూతురి నిశ్చితార్థం..
- November 19, 2022
ముంబై: అమీర్ ఖాన్ కూతురిగా ఐరా ఖాన్ అందరికి సుపరిచితమే. ఇక సోషల్ మీడియాలో తాను పెట్టే హాట్ హాట్ ఫొటోలతో మరింత పాపులారిటీని సంపాదించుకుంది ఐరా ఖాన్. ఇటీవల తన పుట్టిన రోజు వేడుకల్ని బికినీ వేసుకొని సెలెబ్రేట్ చేసుకొని వివాదంలో కూడా చిక్కుకుంది. ఇక ఐరా ఖాన్ గత రెండేళ్లుగా నుపుర్ శిఖర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తుంది.
ఫిట్నెస్ ట్రైనర్, సైక్లిస్ట్ అయిన నుపుర్ తో ఐరా గత రెండేళ్లుగా ప్రేమలో ఉంది. ఇటీవల ఓ సైక్లింగ్ ఈవెంట్ లో నుపుర్ ఉంగరం తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చొని పెళ్లి చేసుకుందామా అని అడిగితే ఐరా లిప్ కిస్ ఇచ్చి మరీ ఓకే చెప్పింది. ఈ వీడియో బాగా వైరల్ అయింది. తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఐరా, నుపూర్ ప్రేమకు ఇరు కుటుంబాలు ఓకే చెప్పడంతో వారి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ నిశ్చితార్థ వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. ఈ ఎంగేజ్మెంట్ లో ఐరా రెడ్ గౌనులో మెరిసిపోతుంటే నుపుర్ శిఖర్ బ్లాక్ సూట్ ధరించాడు. ఈ నిశ్చితార్థ వేడుకల్లో అమీర్ ఖాన్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ కొత్త జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!