దూకుడు డ్రైవింగ్, ట్రాఫిక్ చట్టాల ఉల్లంఘన.. బహ్రెయిన్‌లో ప్రమాదాలకు ఇవే ప్రధాన కారణాలు

- November 19, 2022 , by Maagulf
దూకుడు డ్రైవింగ్, ట్రాఫిక్ చట్టాల ఉల్లంఘన.. బహ్రెయిన్‌లో ప్రమాదాలకు ఇవే ప్రధాన కారణాలు

బహ్రెయిన్‌: దూకుడు డ్రైవింగ్, అతివేగం, ప్రాథమిక ట్రాఫిక్ చట్టాలను విస్మరించడం బహ్రెయిన్ లో అధిక సంఖ్యలో ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయని ఓ అధ్యయనం తెలియజేసింది. నివేదిక ప్రకారం.. బహ్రెయిన్‌లో జాతీయ సెలవు దినం రోజయిన శుక్రవారం అతి తక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. గురువారాల్లో అత్యధిక సంఖ్యలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా బుధవారం సాయంత్రం, శనివారం మధ్య వాహనాలు అధిక సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నాయి. ముఖ్యంగా కింగ్‌డమ్ పొరుగు దేశాల నుండి పెద్ద సంఖ్యలో సందర్శకులు ఆయా రోజుల్లో వస్తుంటాయి. దీంతో బహ్రెయిన్ రోడ్లపై ట్రాఫిక్ పెరుగడంతోపాటు వాహనాల డ్రైవర్లు దూకుడుగా ఉంటారు. అధిక వేగంతో డ్రైవ్ చేయడం, డ్రిఫ్టింగ్, స్ట్రీట్ స్కేటింగ్ వంటి వివిధ రకాల విన్యాసాలను డ్రైవర్లు చేస్తున్నారు. పబ్లిక్ రోడ్లపై రోలర్ స్కేటింగ్ విన్యాసాలకు పాల్పడ్డ ఇద్దరిని ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పబ్లిక్ రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం, ఇతరుల ప్రాణాలకు, తమ ప్రాణాలకు హాని కలిగించినందుకు పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com