తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి
- November 20, 2022
హైదరాబాద్: తెలంగాణ లో చలి తీవ్రత భారీగా పెరిగింది. గత నాల్గు రోజులుగా చలి తీవ్రత మరింత పెరుగుతూ వస్తుంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల దిగువకు పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం పది గంటలైనా చలి తీవ్రత తగ్గడం లేదు. ఈ సీజన్ లో నవంబరు నెలలోనే చలి మొదలైంది. వారం రోజుల కిందట 15 డిగ్రీలున్న ఉష్ణోగ్రత.. ఇప్పుడు 10.7 డిగ్రీలకు పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో మరీ తక్కువగా ఉంది. వాతావరణం కొద్దిగా భిన్నంగా ఉండటంతో.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెల్లవారు జామున మంచు కురుస్తుండటంతో పాటు.. చలిగాలులు ఎక్కువగా ఉంటున్నాయి.
రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 2 నుంచి 4 డిగ్రీల సెల్షియస్ వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముందని అంచనా వేశారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 16.1 సెల్షియస్ వరకు నమోదయ్యే అవకాశం కనిపిస్తోందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో రాబోయే రెండు రోజుల పాటు చలిగాలులు మరింత పెరిగే అవకాశముందని, ఉష్ణోగ్రతలు రెండు లేదా మూడు డిగ్రీలు తగ్గే అవకాశముందని తెలిపింది.
నగరంలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు కూడా చలిగాలులు వీస్తున్నాయని, అవి మరికొద్దిరోజుల పాటు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్‌లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్‌లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







