దుబాయ్ లో ఫిఫా ప్రపంచ కప్ వేడుకలు: గైడ్ లైన్స్ జారీ
- November 20, 2022
దుబాయ్: దుబాయ్‌లో ఉత్సాహంగా ఉండండి.. సురక్షితంగా ఉత్సాహంగా ఉండండి.. ప్రపంచవ్యాప్తంగా ఎమిరేట్‌కు తరలివచ్చిన ఫుట్‌బాల్ అభిమానులకు దుబాయ్ పోలీసులు ఇచ్చిన సందేశం ఇది. దోహాకు ప్రయాణించే ప్రపంచ కప్ అభిమానులకు దుబాయ్ గేట్వేగా ఉన్నది. అదే సమయంలో మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే అనేక ఫ్యాన్ జోన్లకు నిలయంగా దుబాయ్ నిల్వనున్నది. ఫిఫా ప్రపంచ కప్ 2022 కోసం తమ అభిమాన జట్లను ఉత్సాహపరిచేటప్పుడు స్థానిక చట్టాలను గౌరవించాలని ఫుట్‌బాల్ అభిమానులను దుబాయ్ పోలీసులు కోరారు. పబ్లిక్ మార్గదర్శకాలు, నైతికతలకు కట్టుబడి ఉండండి.. పోలీసుల సూచనలను అనుసరించాలని పోలీసులు కోరారు.
దుబాయ్ పోలీసులు జారీ చేసిన కొన్ని గైడ్ లైన్స్
- ఫోటోలు తీస్తున్నప్పుడు ఇతరుల గోప్యతను గౌరవించాలి.
- దయచేసి ప్రజా ఆస్తులను కాపాడాలి.
- బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం.
- ఇతర మతాల పట్ల ధిక్కారం, వివక్ష కూడదు.
- రాజకీయ నినాదాలు చేయడం నిషేధం.
- లైసెన్స్ లేని మసాజ్ పార్లర్లు, అనుమానాస్పద ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
- బహిరంగ ప్రదేశాల్లో ఆప్యాయత చూపడంలో హద్దులు పాటించాలి.
- వ్యక్తిగత సామగ్రిని బహిరంగ ప్రదేశాల్లో ఉంచవద్దు.
- టాక్సీ నంబర్‌ను సేవ్ చేయడం లేదా చెల్లింపు రసీదుని కచ్చితంగా ఉంచుకోవాలి. వస్తువులు పోయినప్పుడు కనుగొనడం సులభం అవుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన