కొలరాడో నైట్ క్లబ్లో కాల్పులు.. ఐదుగురు మృతి..
- November 20, 2022
అమెరికా: అమెరికాలోని కొలరాడో గే నైట్ క్లబ్లో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మరో 18 మందికిపైగా గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
కొలరాడోలో ఉన్న ‘క్లబ్ క్యూ’ నైట్ క్లబ్లో సాయుధుడైన ఒక దుండగుడు తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 18 మంది గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 20న ‘ట్రాన్స్జెండర్ డే ఆఫ్ రిమెంబ్రెన్స్ (టీడీఓఆర్)’గా జరుపుకొంటారు. ట్రాన్స్జెండర్లు, గేలు, లెస్బియన్లు ఈ డేను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ క్లబ్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అయితే, ఇదే రోజును లక్ష్యంగా చేసుకుని దుండగుడు కాల్పులు జరిపాడు. ఇక.. గాయపడ్డవారిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితుడు ఈ దారుణానికి పాల్పడటానికి గల కారణాలు తెలియరాలేదు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం