తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి
- November 21, 2022
తెలంగాణ: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముమ్మళ్ళపల్లి జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను వెనుక నుంచి గరుడ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా , 16 మందికి గాయాలు అయ్యాయి. కొత్తకోట మండలంలోని ముమ్మాళ్లపల్లి వద్ద నేషనల్ హైవేపై చెరకులోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి ఆర్టీసీ గరుడ బస్సు బలంగా ఢీకొట్టింది. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం పాలవ్వగా.. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన బాధితులను పోలీసులు అంబులెన్స్లో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. మియాపూర్ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో క్లీనర్ సందీప్, డ్రైవర్ ఆంజనేయులతో పాటు ప్రయాణికుడు శివన్న ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదం వల్ల ముమ్మాళ్ళపల్లి నుండి అమడబాకుల వరకు జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!