ఫిఫా వరల్డ్ కప్ 2022 డే 3 షెడ్యూల్
- November 22, 2022 
            దోహా: ఖతర్ వేదికగా ఫుట్‌బాల్ ప్రపంచకప్ సమరం ఆదివారం నాడు ప్రారంభమైన విషయం తెలిసిందే. సోమవారం నాడు ఇరాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. సెనెగల్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ గెలవగా.. యూఎస్ఏ-వేల్స్ మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో మూడో రోజైన మంగళవారం నాడు మరో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ రోజు కొన్ని ఆసక్తికర మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న లియోనల్ మెస్సీ జట్టు అర్జెంటీనా ఈ రోజే తన తొలి మ్యాచ్ ఆడనుంది. అంతేకాకుండా డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌కు కూడా ఈ రోజే బరిలో దిగనుంది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ రోజు మ్యాచ్‌ల వివరాలు..
- మొదటి మ్యాచ్ గ్రూప్-సీ జట్లయిన అర్జెంటీనా-సౌదీ అరేబియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది.
- రెండో మ్యాచ్ గ్రూప్ డీ నుంచి డెన్మార్క్-టునేషియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 6.30 గంటలకు జరగనుంది.
- మూడో మ్యాచ్ గ్రూప్-సీ జట్లయిన మెక్సికో-పోలాండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 9.30 గంటలకు ప్రారంభం కానుంది.
- ఈ రోజు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఫ్రాన్స్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరనుంది.
ఈ రోజు రెండు పెద్ద జట్లు బరిలో దిగనున్నాయి. మెస్సీ ఆడుతున్న అర్జెంటీనా జట్టు సౌదీ అరేబియాతో పోటీ పడుతుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇవి కాకుండా డెన్మార్క్‌ను, పోలాండ్‌ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలులేదు.
ఫుట్ బాల్ అభిమానులు ఫిఫా 2022 మ్యాచ్‌లు చూసేందుకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఫిఫా అధికారిక ఛానల్ నుంచి చూడవచ్చు.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







