కారులో భారతదేశం నుండి ఖతార్ చేరిన కేరళ కుటుంబం
- November 23, 2022
యూఏఈ: కేరళకు చెందిన కెవిటి అష్రఫ్‌కు ఫుట్‌బాల్, ప్రయాణం అంటే చాలా మక్కువ. ఫిఫా ప్రపంచ కప్‌లో మ్యాచ్‌లను చూడటానికి గత 23 రోజులపాటు రోడ్డు మార్గన ప్రయాణించి అష్రఫ్, అతని కుటుంబం ఖతార్ చేరుకోన్నది. అష్రఫ్, అతని భార్య షహనాస్, అతని కుమారుడు అబ్దుల్లా ఇబ్ను అష్రఫ్, అతని మేనల్లుడు మొహమ్మద్ ఫరాజ్ అక్టోబర్ 30న దక్షిణ భారతదేశంలోని కన్నూర్ పట్టణం నుండి తమ టయోటా ఇన్నోవాలో బయలుదేరారు. రెండు వారాల పాటు భారతదేశం గుండా ప్రయాణించిన తర్వాత.. కుటుంబం గత వారం దుబాయ్ చేరుకుంది. అక్కడ అష్రాఫ్ కుమార్తె అక్సానా బీగం, ఆమె భర్త ఇర్ఫాన్ వారితో చేరారు. యూఏఈ నుండి బయలుదేరి ఒమన్, బహ్రెయిన్, కువైట్ , సౌదీ మీదుగా ఖతార్ చేరుకున్నది. ఖతార్‌లో నివాసముంటున్న ఫరాజ్ తల్లిదండ్రులను కలుసుకోవడం యాత్ర దిగ్విజయంగా ముగిసింది. డిసెంబరు 1న జర్మనీ, కోస్టా రైస్‌తో తలపడటాన్ని చూసేందుకు కుటుంబం టిక్కెట్లను బుక్ చేసుకుంని అష్రఫ్ తెలిపారు. అలాగే క్వార్టర్-ఫైనల్, సెమీఫైనల్‌లకు కూడా టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్నట్లు ఇర్ఫాన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







