సూపర్ ఫ్రైడే డీల్స్: 75% తగ్గింపును ఎలా పొందాలంటే?
- November 23, 2022
బహ్రెయిన్: నవంబర్ చివరలో వచ్చే వార్షిక సూపర్ ఫ్రైడే సేల్‌కు లులూ(LuLu) సూపర్ మార్కెట్లు సిద్ధమవుతున్నాయి. ఈ సంవత్సరం నవంబర్ 22 నుండి 29 వరకు బహ్రెయిన్‌లోని 9 లులూ అవుట్‌లెట్‌లలో షాపింగ్ చేయడం ద్వారా దాదాపు 75 శాతం వరకు తగ్గింపులు పొందవచ్చని లులూ ప్రకటించింది. డిస్కౌంట్‌లు, బిగ్ బ్యాంగ్ ప్రత్యేక ధరలు, ఫ్లాష్ సేల్స్, ఎలక్ట్రానిక్స్, ల్యాప్‌టాప్‌లు, గేమ్‌లు, టేబుల్‌లు, గృహోపకరణాలు, కిరాణా, తాజా ఆహార పదార్థాలు నుండి మొబైల్ ఫోన్‌లు, ఫ్యాషన్, ఇతర ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డ్‌తో ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే కస్టమర్‌లు, అన్ని కొనుగోళ్లపై 20% తగ్గింపును పొందుతారు. గ్లోబల్ సూపర్ ఫ్రైడే సేల్ అనేది రిటైల్ పరిశ్రమ సంప్రదాయం. లులూ నవంబర్ 24న లులూ రామ్లీ మాల్‌లో.. నవంబర్ 27న హిద్‌లో అర్ధరాత్రి వరకు షాపింగ్ మాల్స్ ని నిర్వహించనున్నది. ఆఫర్‌లు అన్ని లులూ స్టోర్‌లు & లులూ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ http://www.Luluhypermarket.com, యాప్‌లో కూడా అందుబాటులో ఉంటాయని తెలిపింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







