సులేమానియా -బలాద్ మధ్య రోజూ 42 హై-స్పీడ్ రైల్ షటిల్ సర్వీసులు

- November 23, 2022 , by Maagulf
సులేమానియా -బలాద్ మధ్య రోజూ 42 హై-స్పీడ్ రైల్ షటిల్ సర్వీసులు


జెడ్డా: హరమైన్ హై-స్పీడ్ రైలు.. సులేమానియా స్టేషన్, జెడ్డా నగరంలోని బలాద్ డౌన్‌టౌన్ ప్రాంతం మధ్య షటిల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసులను ప్రారంభించినట్లు జెడ్డా ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ప్రకటించింది. బలాద్, సులేమానియా స్టేషన్‌ మధ్య 42 షటిల్ సర్వీసులను నిర్వహిస్తుందన్నారు. వన్-వే ప్రయాణానికి నామమాత్రపు ఛార్జీ SR3.45ని నిర్ణయించినట్లు తెలిపింది. ప్రతి 50 నిమిషాలకు ఒక సర్వీసు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్నారు. బస్సు సర్వీస్ ఆపరేటింగ్ సమయం రోజుకు 17 గంటలు అని.. ఉదయం 7.15 నుండి రాత్రి 12.00 గంటల వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. బలాద్‌లోని హిస్టారిక్ ఏరియా నుండి బగ్దాదియా, కింగ్ అబ్దుల్ అజీజ్ యూనివర్శిటీ, అల్-సలామ్ మాల్ మీదుగా రౌండ్ ట్రిప్ మొదలవుతుందని తెలిపింది. చివరకు సులేమానియా స్టేషన్‌లో, ఆపై తిరిగి అదే ట్రాక్‌లో బలాద్‌కు చేరుకుంటుందని వివరించింది. వికలాంగుల కోసం కేటాయించిన స్థలాలు, ట్రావెల్ బ్యాగుల కోసం నిర్దేశించిన స్థలాలతో పాటు 33 మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యంతో బస్సులను రూపొందించినట్లు తెలిపారు. ట్రిప్ కోసం ప్రత్యేక సేల్స్ పాయింట్ల ద్వారా లేదా SAPTCO చెల్లింపు అప్లికేషన్‌ని ఉపయోగించడం ద్వారా కొనుగోలు చేయవచ్చని జెడ్డా ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com