ఏపీలో ట్రాన్స్ జెండర్ ప్రొటెక్షన్ సెల్ ప్రారంభం...
- November 23, 2022
అమరావతి: మంగళగిరి లోని ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో స్టేట్ లెవల్ ట్రాన్స్ జెండర్ ప్రొటెక్షన్ సెల్‌ను CID డీజీ పీవీ సునీల్ కుమార్ ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డీజీపీ కె.వి.రాజేంద్రనాద్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రాన్స్ జండర్ ప్రొటెక్షన్ సెల్ ను ప్రారంభించడం జరిగింది. ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ సెల్ కి ఎస్పీ సరిత నోడల్ ఆఫీసర్‌గా పనిచేస్తారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో ట్రాన్స్జెండర్ల ప్రొటెక్షన్ సెల్‌ను కూడా అడిషనల్ డీజీ సునీల్ కుమార్ ఏర్పాటు చేశారు. మంగళగిరి లోని CID కాన్ఫిరెన్సు హాల్ లో జరిగిన ఈ సమావేశంలో సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సునీల్ గారు మాట్లాడుతూ...ట్రాన్స్ జెండర్ల రక్షణ, హక్కులు మరియు సంక్షేమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లింగమార్పిడి రక్షణ చట్టం, 2019ని ఆమోదించిందని తెలిపారు. అదేవిధంగా 2020 సంవత్సరంలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ v/s యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు లింగమార్పిడి రక్షణ నియమాలను రూపొందించిందని గుర్తుచేశారు. ట్రాన్స్ జెండర్ లకు విద్య మరియు ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టంగా చెప్పబడిందన్నారు. ఈ ట్రాన్స్ జెండర్ ప్రొటెక్షన్ సెల్ ప్రతి జిల్లాలో జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో పనిచేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ట్రాన్స్ జెండర్లను గౌరవించాలన్నారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో ట్రాన్స్ జెండర్ల కు సంబంధించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని స్థానిక పోలీసు అధికారులకు అడిషనల్ డీజీ సునీల్ కుమార్ గారు ఆదేశాలు జారీ చేశారు.
ట్రాన్స్జెండర్లు తమ సమస్యతో పోలీస్ స్టేషన్‌కు వస్తే వారితో మర్యాదగా వ్యవహరించాలని ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ సరిత పేర్కొన్నారు.ట్రాన్స్ జెండర్లు ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి తక్షణమే వారికి న్యాయం చేయాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలో కేవలం 3,800 మంది ట్రాన్స్జెండర్లకు మాత్రమే ఓటు హక్కు ఉందని, జనాభా లెక్కల ప్రకారం 28 వేల మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారని సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి తెలిపారు. ప్రతి నెలా మూడు వేల రూపాయల పెన్షన్, అర్హతను బట్టి ఇంటి పట్టాలు కూడా ఇవ్వబడతాయన్నారు.విద్యార్థులకు ఉద్యోగాల లో కూడా అవకాశాలు ఇవ్వబడతాయని ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో WINS కార్యదర్శి ఆర్.మీరా, VHS డైరెక్టర్ వెంకట్, APSACS అడిషనల్ డైరెక్టర్ కామేశ్వర ప్రసాద్ లు పాల్గొన్నారు.అదేవిధంగా ప్రతి జిల్లా నుంచి ట్రాన్స్ జెండర్ల నాయకులు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!
- పబ్లిక్ హెల్త్ ప్రమోషన్లో ప్రైవేట్ పాత్ర కీలకం..!!
- ఖతార్ లో NCD స్క్రీనింగ్ కేంద్రాలు పెంపు..!!
- మయన్మార్ చెర నుంచి 55 మందిని విడిపించిన ప్రభుత్వం







