అమెరికా ప్రయాణం అంత సులభం కాదు...
- November 24, 2022
అమెరికా: అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య ఎక్కువగా పెరిగింది.దీంతో అన్ని రకాల వీసా ఇంటర్వ్యూల వెయిటింగ్ పీరియడ్ పెరుగుతూనే ఉంది.అమెరికా వెళ్లాలనుకుంటే డబ్బులుంటే చాలదు. వెయిటింగ్ చేసేంత ఓపిక కూడా ఉండాల్సిందే. మాహా అంటే రెండు నెలలు, మూడు నెలలు అనుకుంటున్నారేమో.అప్లై చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ కోసం మూడేళ్లు నీరిక్షించాల్సిందే. అవును మరి.. అమెరికా పర్యాటక వీసా అపాయింట్‌మెంట్ కోసం దాదాపు 1000 రోజుల వెయిటింగ్ లిస్టు ఉంది. అంటే బిజినెస్, టూరిస్టు విసాపై అమెరికా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకుంటే, వారికి 2025 జూన్ లేదా జులైలో విసా అపాయింట్‌మెంటు దొరుకుతుందన్నమాట. భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే వారికోసం అమెరికా ఎంబసీ వివిధ రకాల వీసాలను జారీ చేస్తుంది. ఇందుకోసం దరఖాస్తుదారులకు వీసా అపాయింట్‌మెంట్ కోసం పట్టే సమయాన్ని, అమెరికా విదేశాంగశాఖకు చెందిన వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. అయితే, ఆయా ఎంబసీ, కాన్సులేట్‌లలో వీసా ఇంటర్వ్యూలను నిర్వహించే సిబ్బందిని బట్టి ఈ సమయాన్ని ప్రతివారం అప్‌డేట్ చేస్తుంటారు.
భారత్‌లో ఢిల్లీ ఎంబసీతో పాటు హైదరాబాద్, చెన్నై, ముంబై, కోల్‌కతా కాన్సులేట్ల నుంచి వీసా జారీ సేవలు అందిస్తోంది.ముంబై ఎంబసీ నుంచి పర్యాటక వీసా బీ1, బీ2 కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ కోసం 999 రోజులు నిరీక్షించాలని అమెరికా అధికారిక వెబ్‌సైట్‌లో చూపిస్తోంది.అంటే దాదాపు 31 నెలలు వేచి చూడాలి.ఇదే వీసా కోసం హైదరాబాద్ నుంచి దరఖాస్తు చేసుకుంటే.. 994 రోజులు, చెన్నై నుంచైతే 948 రోజులు, ఢిల్లీ నుంచి 961 రోజులు, కోల్‌కతా నుంచి 904 రోజుల అపాయింట్‌మెంట్ వెయిట్ టైం ఉంది. అయితే ఇతర వీసాలకు ఈ వెయిటింగ్ లిస్ట్ కాస్త తక్కువగానే ఉంది.
హైదరాబాద్ నుంచి స్టూడెంట్, ఎక్స్చేంజ్ వీసాల అపాయింట్‌మెంట్ కోసం 374 రోజులు వేచి ఎదురుచూడాల్సి వస్తోంది. పిటిషన్ బేస్డ్ టెంపరరీ వర్కర్ వీసాల అపాయింట్‌మెంట్ వెయిటింగ్ టైం 366 రోజులుగా ఉంది. వీసా ఇంటర్వ్యూల సమయం ఎక్కువగా ఉండటంపై అమెరికా రాయబార కార్యాలయం అప్పట్లో స్పందించింది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌తో పాటు సిబ్బంది కొరత కారణంగా వీసా జారీ ప్రక్రియ ఆలస్యమవుతోందని, కేవలం కొత్తగా వీసా పొందేవారికే వెయిటింగ్ టైం ఎక్కువగా ఉంటోందని చెప్పింది. అయితే వీసా జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ మొదటి విమానాశ్రయం.. మ్యూజియంగా ప్రారంభం
- ఇంటి ఓనర్ సౌకర్యాల వినియోగానికి అదనంగా వసూలు చేయవచ్చా?
- జింబాబ్వే ప్రైవేట్ విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి
- 7 రోజుల్లో 11,465 మంది అరెస్ట్
- స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ప్రారంభం
- అక్టోబర్ 2న అబుధాబిలో వాహనాల పై ఆంక్షలు
- విజయవాడ విద్యార్థులకు తానా స్కాలర్ షిప్ లు పంపిణీ...
- ఖతార్ లో ఘనంగా Mrs.CIA బ్రీఫింగ్ సెషన్
- ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలు
- అక్టోబర్ 07 వరకు రూ.2000 నోట్లు మార్పిడి చేసుకోవచ్చు