తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు న్యాయమూర్తులు బదిలీ..
- November 24, 2022
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న ముగ్గురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. వీరిలో జస్టిస్ లలిత కన్నెగంటిని కర్ణాటక హైకోర్టుకు బదిలీచేస్తూ కోలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ అభిషేక్ రెడ్డి పాట్నా హైకోర్టుకు, అదేవిధంగా తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న మరో న్యాయమూర్తి జస్టిస్ నాగార్జున్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది.
అదేవిధంగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవనంద్ను మద్రాసు హైకోర్టుకు, అదే హైకోర్టులో పనిచేస్తున్న మరో న్యాయమూర్తి జస్టిస్ డి. రమేష్ ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. వీరితో పాటు మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్టి టి. రాజును రాజస్థాన్ హైకోర్టుకు, జస్టిస్ వి.ఎం. వేలుమణిని కోల్కత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు కొలీజియం న్యాయశాఖకు సిఫారసు చేసింది.
తాజా వార్తలు
- ఫిలిఫ్పీన్స్‌లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ..
- దుబాయ్ లో ఘనంగా యూఏఈ 52వ నేషనల్ డే వేడుకలు
- యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకల కోసం ట్రాఫిక్ రూల్స్ జారీ
- హైదరాబాద్ నుండి గోండియాకు విమాన సర్వీసులు ప్రారంభం
- ప్రభుత్వ సెలవు దినాల్లో మూడు ఎమిరేట్స్‌లో ఉచిత పార్కింగ్
- AFC ఆసియా కప్ ఖతార్ 2023 మస్కట్ల ఆవిష్కరణ
- యువరాజు మమదూహ్ బిన్ అబ్దుల్ అజీజ్ అంత్యక్రియల ప్రార్థనలో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్
- అవినీతి నిరోధక శాఖ అదుపులో 146 మంది
- ఒమన్, స్విట్జర్లాండ్ మధ్య కీలక ఒప్పందాలు
- నాలుగు రాష్ట్రాల్లో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..