శిల్పా లేవుట్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- November 25, 2022
హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లని శిల్పా లే అవుట్ మొదటి దశ ఫ్లై ఓవర్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఐటీ కారిడార్‌ను ఓఆర్ఆర్‌తో అనుసంధానం చేస్తూ రూ. 250 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించింది. ఐకియా మాల్ వెనుక నుంచి నిర్మించిన ఈ వంతెన ఓఆర్ఆర్‌పైకి చేరనున్నది. ఇనార్బిట్ మాల్, రహేజా మైండ్ స్పేస్ చౌరస్తా, బయో డైవర్సిటీ చౌరస్తా మధ్య నిర్మిస్తున్న హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్‌ను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇది మూడోది.
వంతెన పొడవు 956 మీటర్లు కాగా.. వెడెల్పు 16 మీటర్లు. హైదరాబాద్‌లోని ఫ్లై ఓవర్లలో ఇదే అతి పొడవైనది కావడం విశేషం. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా చేపట్టిన పనుల్లో పూర్తయిన 17వ ప్రాజెక్టు. ఫ్లై ఓవర్ ప్రారంభంతో గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ మధ్య రోడ్ కనెక్టివిటీ మరింత పెరగనున్నది. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వంతెనను ప్రారంభించిన అనంతరం ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి తిలకించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







