సౌదీ అల్ హిలాల్ క్లబ్‌లోకి క్రిస్టియానో రొనాల్డో?
- November 26, 2022
యూఏఈ: ఇటీవల మాంచెస్టర్ యునైటెడ్ నుండి బయటికొచ్చిన స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో త్వరలోనే సౌదీ అరేబియాకు చెందిన సౌదీ అల్ హిలాల్ క్లబ్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.సౌదీ అరేబియా క్లబ్ అల్ హిలాల్ క్లబ్ క్రిస్టియానో రొనాల్డోతో ఒప్పందం చేసుకునేందుకు జరిపిన చర్చలు ఇప్పటికే తుది దశకు వచ్చాయని సమాచారం. త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని క్లబ్ తెలిపే అవకాశం ఉన్నది. కాగా, బ్రెజిల్ కు చెందిన ప్రముఖ క్లబ్ లలో ఒకటైన ఫ్లెమింగో సైతం రొనాల్డోను చేజిక్కించుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, £305 మిలియన్లకు ఆఫర్ ఇచ్చిన సౌదీ అల్ హిలాల్ క్లబ్‌లో చేరేందుకు క్రిస్టియానో రొనాల్డో ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







