హైదరాబాద్‌లో ప్రారంభానికి సిద్దమైన అమెరికా కాన్సులేట్ ఆఫీస్
- November 26, 2022
హైదరాబాద్: హైదరాబాద్‌లో నిర్మించిన అమెరికా కాన్సులేట్ ఆఫీస్ ప్రారంభానికి సిద్ధమైంది. నానక్రామ్గూడాలో ఈ నూతన కార్యాలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం బేగంపేటలో ఉన్న అమెరికా కాన్యులేట్ త్వరలోనే హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించిన నూతన భవనంలోకి మారనుంది. భారత్-అమెరికా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను పర్యవేక్షించడమే ఈ ఆఫీస్ ముఖ్యలక్ష్యం. 2023, జనవరి తొలివారంలోనే యూఎస్ కాన్సులేట్ సేవలు ప్రారంభం కానున్నాయని అధికారులు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో నిర్మించిన ఈ భవనానికి సుమారు 297 మిలియన్ డాలర్లు ఖర్చు అయినట్లు సమాచారం.
ఈ యూఎస్ కాన్సులేట్ ఆసియాలనే అతిపెద్దదిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ నూతన ఆఫీస్‌లో వీసా దరఖాస్తుల కోసం 54 విండోలు పని చేయనున్నాయి. దీంతో వీసా సేవలు మరింత సులభం కానున్నాయి. ఇక అమెరికా వెళ్లాలనుకునే వారు వీసా దరఖాస్తు, ఇంటర్వ్యూల కోసం కాన్సులేట్ కార్యాలయానికి వెళ్తారనే విషయం తెలిసిందే. 2008కి ముందు హైదరాబాద్‌లో యూస్ కాన్సులేట్ లేదు. అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులు కచ్చితంగా చెన్నై వెళ్లాల్సి వచ్చేది. దీంతో హైదరాబాద్‌లోని బేగం పేట పైగా ప్యాలెస్‌లో అమెరికా కాన్యులేట్ కార్యకలాపాలు మొదలుపెట్టారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్‌జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









