సుధీర్ బాబు ‘హంట్’ మామూలుగా వుండదంట.!
- November 26, 2022
విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు హీరో సుధీర్ బాబు. సుధీర్ బాబు సినిమాల్లో ఖచ్చితంగా ఆసక్తికరమైన కంటెంట్ వుంటుందన్న నమ్మకం ప్రేక్షకుల్లో వుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెబుతా’ కాస్త నిరాశపరిచినా, తాజా మూవీతో ప్రేక్షకుల్ని అస్సలు నిరాశపరిచేది లేదంటున్నాడు సుధీర్ బాబు.
పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రేపో మాపో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోనుంది. సీనియర్ హీరో శ్రీకాంత్‌తో పాటూ, తమిళ హీరో భరత్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సుధీర్ బాబు పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో చిత్ర శుక్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ అత్యంత కీలకమనీ సుధీర్ బాబు చెబుతున్నాడు.
హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్లతో హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయట. సరికొత్త యాక్షన్ అనుభూతినిచ్చే సినిమా ‘హంట్’ అని సుధీర్ బాబు హింట్ ఇస్తున్నాడు. చూడాలి మరి.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







