మారుతి ‘మాయాజాలం’.! భయపెట్టడం ఖాయమంటోన్న ప్రబాస్.!
- November 26, 2022
యూనివర్సల్ స్టార్ అనిపించుకున్న ప్రబాస్, ఆ తర్వాత స్టార్ డైరెక్టర్లతోనే సినిమాలు ఓకే చేస్తున్నాడు. అలాంటిది చిన్న సినిమాల డైరెక్టర్ అయిన మారుతికి ఛాన్సిచ్చి ప్రబాస్ మరోసారి సెన్సేషనల్ అయ్యాడు.
అయితే, మారుతితో సినిమా వద్దంటూ ప్రబాస్ ఫ్యాన్స్ ఎంత మొత్తుకున్నా ప్రబాస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో వెనక్కి తగ్గలేదు. సైలెంట్‌గా ఈ సినిమా స్టార్ట్ చేసేశాడు కూడా.
కథ విషయానికి వస్తే, ఇదో హారర్ కామెడీ సినిమా అని ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ వచ్చేసిన ఆ టైప్ సినిమాలనే అటూ ఇటూ మార్చేసి ప్రబాస్‌తో తీసేయబోతున్నాడు మారుతి అంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయ్.
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాతో ప్రబాస్ భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఆ భయపెట్టడం ఏ స్థాయిలో వుండబోతోందో మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.
ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటించబోతున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ఇప్పటికి సెట్ అవ్వగా, ఆ మూడో హీరోయిన్ పేరు ఇంకా రివీల్ కావల్సి వుంది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







