స్టాక్‌ మార్కెట్లలో వ్యాపారాల్ని సులభతరం

- April 24, 2016 , by Maagulf
స్టాక్‌ మార్కెట్లలో వ్యాపారాల్ని సులభతరం

స్టాక్‌ మార్కెట్లలో వ్యాపారాల్ని సులభతరం చేయడానికి సెబీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా బ్రోకరేజీ సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్స్‌, పోర్టుఫోలియో మేనేజర్లు తదితరాల రిజిస్ట్రేషన్లను ఆన్‌లైన్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆయా సంస్థల తనిఖీలు, కార్యాచరణ నివేదికలను కూడా ఆన్‌లైన్‌ పంపించే ఏర్పాటు చేయనుంది.ఇప్పటి వరకు సెబీ కమోడిటీ డెరివేటివ్‌ బ్రోకర్లకు మాత్రమే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పుడు ఇటువంటి సౌకర్యాన్నే ఈక్విటీ బ్రోకర్లకు కూడా కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిని అన్ని రకాల బ్రోకరేజీలకు విస్తరించనుంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చే వారికి.. ఇప్పటికే మార్కెట్లో ఉన్నవారికి సెబీకి సంబంధించిన వ్యవహారాలను త్వరగా పూర్తి చేసుకునేందుకు ఇది తోడ్పడుతుంది.ఈ పద్దతితో భవిష్యత్తులో బ్రోకర్స్‌, మర్చెంట్‌ బ్రోకర్స్‌, డిబెంచర్‌ ట్రస్టీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌, డొమెస్టిక్‌, విదేశీ పోర్టుఫోలియో మేనేజర్లు, రేటింగ్‌ ఏజెన్సీలు, రిజిస్టర్‌ అండ్‌ షేర్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజంట్లు, ఆల్టర్‌నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌, డిపాజిటరీ భాగస్వాములు, ఇన్వెస్టర్‌ అసోసియేషన్స్‌, రీసెర్చి ఎనలిస్ట్‌లు, వెంచర్‌ కాపిటల్‌ ఫండ్స్‌, కలెక్టివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్స్‌ తదితరాలు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కిందకు వచ్చే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com