దుబాయ్ ఎడారి రిజర్వ్ లో కొత్తగా 100 కి.మీ ట్రెక్కింగ్ మార్గం
- November 27, 2022
దుబాయ్: వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ దుబాయ్ లో నిర్మించిన కొత్త ఎడారి రిజర్వ్‌ను సందర్శించారు. కొత్తగా నిర్మించిన 100 కిలోమీటర్ల పొడవైన ట్రెక్కింగ్ మార్గాన్ని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆవిష్కరించారు. "ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరం దుబాయ్. ఇక్కడి గ్రామీణ ప్రాంతాలను, అరణ్యాలను అత్యంత ఆనందదాయకంగా, అందంగా మార్చడం మా తదుపరి లక్ష్యం" అని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
కొత్తగా నిర్మించిన ఎడారి రిజర్వ్ లుసైలీ, లెహబాబ్, అల్ మర్రామ్, అల్ ఫకా, అల్ అవీర్, ఇతర ప్రాంతాలలో విస్తరించింది. ఇందులో మానవ నిర్మిత సరస్సు సైహ్ అల్ సలామ్ ప్రత్యేక ఆకర్షణ. దుబాయ్ లో ఇప్పటికే 90కిమీల ఎడారి సైక్లింగ్ ట్రాక్ ఉన్నది. ఇది కూడా పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నదని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ తెలిపారు.
తాజా వార్తలు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్‌లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్‌పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!
- ఐసీఆర్ఎఫ్ సమ్మర్ డ్రైవ్.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు..!!
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు







