ఎమిరైటేషన్ దుర్వినియోగం: ఎమిరాటీ కంపెనీకి 4.3 మిలియన్ల జరిమానా?

- November 29, 2022 , by Maagulf
ఎమిరైటేషన్ దుర్వినియోగం: ఎమిరాటీ కంపెనీకి 4.3 మిలియన్ల జరిమానా?

యూఏఈ: ఎమిరైటేషన్ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ.. ఓ ఎమిరాటీ కంపెనీ యజమాని తమ కంపెనీలో పని చేయడానికి 43 మంది కుటుంబ సభ్యులను నియమించుకున్నందుకు 4.3 మిలియన్ల వరకు జరిమానా విధించవచ్చుని అధికారులు తెలిపారు.ప్రభుత్వం నిర్దేశించిన ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకునేందుకు కంపెనీలు చేపట్టిన నియామకాలపై దృష్టి సారించినట్లు మానవ వనరులు, ప్రవాసీకరణ మంత్రిత్వ శాఖ (MoHRE) తెలిపింది. కుటుంబ సభ్యులను నియమించుకోవడం నిబంధనలకు విరుద్ధం కానప్పటికీ, ఎమిరేటైజేషన్ కోటాను భర్తీ చేసే క్రమంలో ఎవరైనా నకిలీ పోస్టులను క్రియేట్ చేసి వాటిల్లో బంధువులను నియమించుకుంటే వారిపై చర్యలు తప్పవని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఎమిరేటైజేషన్ సంబంధిత చట్టాలను ఉల్లంఘనకు పాల్పడితే ఆయా కంపెనీలపై చర్యలు తీసుకోవడంతోపాటు భారీ జరిమానాలను విధిస్తామని పేర్కొంది. నిబంధనలను కాదని నియమించుకునే ప్రతి ఎమిరాటీకి Dh100,000 చొప్పున జరిమానా విధించబడుతుందని, ఆయా కంపెనీ యాజమాన్యాలపై చట్టపరమైన చర్య కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com