ఏపీ సిఎం జగన్‌తో కొత్త సీఎస్ భేటీ
- December 01, 2022
అమరావతి: ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి నిన్న బాధ్యతలను స్వీకరించిన విషయం తెలిసిందే. తాజాగా సిఎం జగన్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ ఉదయం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సీఎస్ గా తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి జవహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి. ఆయన సీఎం జగన్ కు ప్రత్యేక కార్యదర్శిగా కూడా పని చేశారు. మరోవైపు నిన్న సీఎస్ గా బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నేతృత్వంలో చివరి వ్యక్తి వరకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తానని చెప్పారు.
తాజా వార్తలు
- కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- బహ్రెయిన్‌లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- కువైట్‌లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం