అయ్యో ‘అమ్ము’.! పెళ్లంటే అలా అనేసిందేంటబ్బా.!

- December 01, 2022 , by Maagulf
అయ్యో ‘అమ్ము’.! పెళ్లంటే అలా అనేసిందేంటబ్బా.!

‘అమ్ము..’ ఇటీవల ఈ పేరుతో ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి టైటిల్ రోల్ పోషించింది. 
ఓటీటీ ప్రేక్షకుల్ని తన నటనతో కట్టి పడేసింది ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాతో. అంతకు ముందే, ‘గార్గి’ తదితర సినిమాల్లో నటించిన ఐశ్వర్య లక్ష్మి, ‘పొన్నియన్ సెల్వన్ 1’లో పూంగుళి అను ఓ కీలక పాత్రలో కనిపించింది. 
అంతేకాదు, ‘గార్గి’ సినిమాతో నిర్మాతగానూ సత్తా చాటిన ఐశ్వర్య లక్ష్మి తాజాగా తమిళంలో ‘‘కట్టా కుస్తా’ అనే సినిమాలో నటించింది. డిశంబర్ 2న ఈ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటోంది. 
ఈ మధ్య ఐశ్వర్య లక్ష్మి పేరు టాలీవుడ్‌లోనూ మార్మోగిపోతుండడంతో, తెలుగులోనూ ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. విష్ణు విశాల్ ఈ సినిమాలో ఐశ్వర్యకు జోడీగా నటిస్తున్నాడు.
కాగా, ఈ సినిమా ప్రమోషన్లలో ఐశ్వర్య లక్ష్మి పెళ్లి ముచ్చట తెరపైకి వచ్చింది. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా.? అరేంజెడ్ మ్యారేజ్ చేసుకుంటారా.? అని అడిగితే. అసలు పెళ్లే చేసుకోనని చెప్పేసింది.ఐశ్వర్య లక్ష్మీ మాటలకు అక్కడున్న వారంతా షాకయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com