న్యూజిలాండ్ షూట్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్.!
- December 01, 2022
శంకర్, రామ్ చరణ్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఓ పాట షూట్ కోసం న్యూజిలాండ్ వెళ్లిన శంకర్ అండ్ టీమ్, తాజాగా ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
న్యూజిలాండ్‌లోని అందమైన లొకేషన్లలో రామ్ చరణ్, కియారా అద్వానీలపై బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించాడు డైరెక్టర్ శంకర్. ఈ సాంగ్ షూటింగ్ పూర్తయ్యిందనీ, చాలా బాగా వచ్చిందనీ సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఓ పోస్ట్ పెట్టాడు.
న్యూజిలాండ్ లొకేషన్లలో దిగిన కొన్ని ఫోటోలు సైతం ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయ్. ఈ సాంగ్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని అంటున్నారు.
వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో 15 వ చిత్రంగా రూపొందుతోంది. చరణ్ డబుల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో అంజలి మరో హీరోయిన్గా నటిస్తోంది. తమిళ డైరెక్టర్ కమ్ నటుడు ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!