అబుధాభిలో సంబరాలు
- December 03, 2022సుందరంగా ముస్తాబైన ఏడు దేశాలు
దేశ సంస్కృతి ఆచార సంప్రదాయాలు
గౌరవిస్తు దేశీయులు విదేశీయులు
ప్రవాసులు మైత్రీసుహృధ్భావనతో
మనసుల్లోఈ దేశంపట్ల ఉప్పొంగే గౌరవము
భిన్నసంస్కృతుల సమాహారము
సమైక్యత ఐకమత్యంతో చేతులెత్తి
చేసేరు జనులంతా వందనాలు .....
కర్మభూమిలో వెల్లివిరిసే ఆనందసరాగాలు
పిల్లల పెద్దల మదిలో ఉప్పొంగే సంతోషాలు
హంగులతో స్వతంత్ర భావాలతో ఠీవీగా
వినువీధుల్లోరెపరెపలాడే త్రివర్ణ పతాకం
మిరుమిట్లు కొలిపే దీపకాంత శిఖాలు
మిన్నంటే అంబరాల సంబరాలు
ఆకాశాన రయ్ రయ్ మనే విన్యాసాలు
కుర్రకారుజోరు హుషారైన షికారులు
అరబ్బీయుల ముచ్చటైన వేషధారణలు
అడుగడుగున వినిపించే దేశీయ గీతాలు
హింస చొరనీయని అహింసే చిరునామాగ
శాంతిభద్రతలు ఆరోగ్యము పర్యావరణ
పరిరక్షణతో విశ్వంలో అత్యున్నత సురక్షిత
దేేశంగా సుభిక్షపాలనతో యాభైవసంతాలు
పూర్తిచేసుకొని యాభైఒకటో వత్సరంలోకి
అడుగిడిగి *జాతీయదినం* వేడుకలు
చేసుకుంటున్న అరబ్బీయుల గల్ఫ్ దేశము.......
(యామిని కోళ్ళూరు,అబుధాభి)
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!