ఫిఫా ప్రపంచ కప్ 2022 ఖతార్: టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక హాజరు నమోదు
- December 04, 2022
ఖతార్: ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ ప్రపంచ ఫుట్‌బాల్ టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక హాజరును నమోదు చేసింది. 2.45 మిలియన్ల మంది ప్రేక్షకుల స్టేడియాలను సందర్శించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఖతార్ ఫిఫా 2022 పోర్టల్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. 13 రోజులపాటు జరిగిన 48 మ్యాచ్‌లకు రికార్డు స్థాయిలో అభిమానులు హాజరయ్యారని తెలిపింది. ప్రతి స్టేడియం సగటున 96 శాతం ఆక్యుపెన్సీ కలిగి ఉన్నదని నివేదిక పేర్కొంది. రష్యాలో జరిగిన 2018 ఎడిషన్‌లో సంబంధిత 2.17 మిలియన్ల సంఖ్య నమోదు చేయబడిందని తెలిపింది.
ఖతార్‌లోని లుసైల్ స్టేడియంలో నవంబర్ 26న జరిగిన అర్జెంటీనా వర్సెస్ మెక్సికో మ్యాచ్‌ను 88,966 మంది అభిమానులు వీక్షించారని, 1994 ఫైనల్ తర్వాత ప్రపంచ కప్ చరిత్రలో ఇదే అత్యధిక హాజరు అని నిర్వాహకులు వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రపంచ కప్ ఎడిషన్‌లో అన్ని ఖండాలకు చెందిన జట్లు రౌండ్ ఆఫ్ 16కి చేరుకోవడం ప్రధాన ఆకర్షణీయ అంశంగా నిలిచింది. పోర్చుగీస్ ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో ప్రపంచ కప్‌లో ఐదు ఎడిషన్లలో స్కోర్ చేసిన మొదటి ఆటగాడిగా రికార్డును నెలకొల్పాడు. ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్‌కు అధికారికంగా రిఫరీగా వ్యవహరించిన మొదటి మహిళగా స్టెఫానీ ఫ్రాపార్ట్ కూడా చరిత్ర సృష్టించింది. నవంబర్ 20న ప్రారంభమైన ఈ టోర్నీ డిసెంబర్ 18 వరకు కొనసాగనుంది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







