‘ఆసియా కప్ 2027’కు సౌదీ అరేబియా ఆతిథ్యం
- December 06, 2022
సౌదీ: ఆసియా కప్ 2027 నిర్వాహణకు భారతదేశం(ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF)) తన బిడ్‌ను ఉపసంహరించుకోవడంతో టోర్నమెంట్‌కు ఏకైక బిడ్డర్‌గా నిలిచిన సౌదీ అరేబియాకు నిర్వాహణ హక్కులు లభించాయి. దీంతో 2027 ఆసియా కప్ కు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈ మేరకు ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (AFC) వెల్లడించింది. అక్టోబర్‌లో భారతదేశం, సౌదీ అరేబియాలను AFC ఎగ్జిక్యూటివ్ కమిటీ షార్ట్‌లిస్ట్ చేసింది.
మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సౌదీ అరేబియా ఇప్పుడు తమ తొలి AFC ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. AFC కాంగ్రెస్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బహ్రెయిన్ రాజధాని మనామాలో హోస్ట్ దేశాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఖతార్‌లో జరుగుతున్న ప్రపంచ కప్‌లో సౌదీ అరేబియా తమ ప్రారంభ మ్యాచ్‌లో 2-1తో అర్జెంటీనాను ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
2023 ఆసియా కప్‌కు కూడా ఖతార్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీనిని గతంలో చైనాలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే దాని కోవిడ్-19 మార్గదర్శకాల కారణంగా దేశం ఉపసంహరించుకుంది. ఆసియా కప్ ప్రతి నాలుగేళ్లకోసారి జరుగుతుంది. 2019లో యూఏఈ ఆతిథ్యమిచ్చిన టోర్నమెంట్ చివరి ఎడిషన్‌ను ఖతార్ గెలుచుకుంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







