హయ్యా కార్డ్ లేకుండానే ఖతార్లోకి.. జీసీసీ పౌరులు, నివాసితులకు అనుమతి
- December 07, 2022
దోహా: జీసీసీ పౌరులు, నివాసితులు హయ్యా కార్డు కోసం నమోదు చేసుకోవలసిన అవసరం లేకుండా ఖతార్లోకి ప్రవేశించడానికి అనుమతించబడతారని ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. విమానాశ్రయాల ద్వారా ప్రయాణించే జీసీసీ దేశాల పౌరులు, నివాసితులు హయ్యా ప్లాట్‌ఫారమ్ ద్వారా రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ఖతార్లోకి ప్రవేశించవచ్చని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సందర్శకుల కోసం ఉచిత ధరల పార్కింగ్ స్థలాలను కేటాయించామని, బస్సుల ద్వారా రవాణా మునుపటి రోజుల మాదిరిగానే పోర్టుల ద్వారా ప్రయాణికులందరికీ అందుబాటులో ఉంటుందని కూడా తెలిపింది. జీససీ దేశాల పౌరులు, నివాసితులు తమ వాహనాల ద్వారా ల్యాండ్ పోర్ట్‌ల ద్వారా వచ్చేవారు డిసెంబర్ 8 గురువారం నుండి ఖతార్లోకి ప్రవేశించవచ్చని పేర్కొంది. అయితే, ప్రయాణ తేదీ నుండి 12 గంటల కంటే తక్కువ వ్యవధితో ఖతారీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ద్వారా ఎలక్ట్రానిక్‌గా అనుమతి కోసం అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటందని తెలిపింది. ప్రపంచ కప్ మ్యాచ్‌లతో పాటు జరిగే కార్యక్రమాల వాతావరణాన్ని ఆస్వాదించడానికి జీసీసీ దేశాల సందర్శకులు, పౌరులు, నివాసితులకు అవకాశం కల్పించడానికి చేసిన ప్రయత్నాలతో భాగంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా వరల్డ్ కప్ మ్యాచ్‌లకు హాజరు కావాలనుకునే అభిమానులు మాత్రం హయ్యా ఈ-ప్లాట్‌ఫాం ద్వారా నమోదు చేసుకోవాలని పేర్కొంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







