హైదరాబాద్ విమానాశ్రయానికి ‘గోల్డ్’ రికగ్నిషన్
- December 07, 2022
హైదరాబాద్: GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) తన బిజినెస్ ఎక్సలెన్స్ (BE) కార్యకలాపాలకు గాను ఇటీవల కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నుండి గుర్తింపు పొందింది. CII ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ (IQ) ద్వారా నవంబర్ 25-26న బెంగుళూరులో జరిగిన క్వాలిటీ సమ్మిట్ 30వ ఎడిషన్‌లో GHIAL ‘గోల్డ్’ కేటగిరీలో ఈ గుర్తింపు పొందింది.
GHIAL గత 10 సంవత్సరాలుగా తన GMR బిజినెస్ ఎక్సలెన్స్ మోడల్ (GBEM) ద్వారా బిజినెస్ ఎక్సలెన్స్ ప్రయాణం కొనసాగిస్తోంది. GBEM మోడల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘మాల్కం బాల్డ్రిడ్జ్ బిజినెస్ ఎక్సలెన్స్ ఫ్రేమ్‌వర్క్’ ఆధారంగా రూపొందించబడింది. ఈ మోడల్ ను చాలా హై పర్ఫార్మెన్స్ కంపెనీలు కూడా అనుసరిస్తున్నాయి. బిజినెస్ ఎక్సలెన్స్ కారణంగా HYD విమానాశ్రయం భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రీ లీడర్లలో ఒకటిగా ఉద్భవించింది. ఈ బిజినెస్ ఎక్సలెన్స్ నమూనా వ్యాపారంలోని ప్రతి అంశంలోనూ సంపూర్ణమైన శ్రేష్ఠతను నిర్ధారించడంలో GHIALకి మార్గనిర్దేశం చేసింది. GBEM కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్‌లు (CIPలు), ఐడియా ఫ్యాక్టరీ, నాలెడ్జ్ మేనేజ్‌మెంట్, CSAT ప్రాసెస్, కస్టమర్ ఫిర్యాదు నిర్వహణ ప్రక్రియలను మెరుగుపరచడం, భద్రతా సంస్కృతిని పెంచడం వంటి కార్యక్రమాలను ప్రారంభించింది.
ఈ విజయంపై జిహెచ్‌ఐఎల్ సిఇఒ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, “సిఐఐ ద్వారా మా బిజినెస్ ఎక్సలెన్స్‌కు గుర్తింపు లభించినందుకు మేము సంతోషిస్తున్నాం.వ్యాపారంలోని అన్ని అంశాలనూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడం మా సంస్థ లక్ష్యం. GMR బిజినెస్ ఎక్సలెన్స్ మా పనితీరును మెరుగుపరచడంలో మాకు సహాయపడుతుంది. ఈ గుర్తింపు సమర్థవంతమైన, మెరుగైన కస్టమర్ అనుభవాన్ని, మా భాగస్వాములందరికీ మరింత విలువను అందించడానికి, రాష్ట్రం మరియు దేశానికి విలువను జోడించడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.’’
CII ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ’ భారతీయ పరిశ్రమకు నాణ్యతా నిర్వహణ సొల్యూషన్స్ అందిస్తుంది. దీని కన్సల్టెంట్ బృందంలో బిజినెస్ ఎక్సలెన్స్, క్వాలిటీ, మెట్రాలజీ & స్టాండర్డ్స్, టోటల్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్, ఆపరేషనల్ ఎక్సలెన్స్, ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ నిపుణులుంటారు. IQ తన క్లయింట్ల ఉత్పత్తులు, ప్రక్రియల్లో నాణ్యతను పెంపొందించడంలో సహాయం చేయడానికి నాణ్యత, సాంకేతిక నిపుణుల పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటుంది.
బెంగుళూరులో జరిగిన క్వాలిటీ సదస్సులో భారతదేశం, విదేశాల నుండి పరిశ్రమలకు చెందిన ప్రఖ్యాత గ్రూపులు, కంపెనీలు పాల్గొన్నాయి. గోద్రెజ్, భారత్ ఎలక్ట్రానిక్స్, బాష్, టీవీఎస్ గ్రూప్, టాటా గ్రూప్ వంటి ఇండస్ట్రీ లీడర్‌లు మరియు దుబాయ్ క్వాలిటీ గ్రూప్, అమెరికన్ సొసైటీ ఆఫ్ క్వాలిటీ వంటి గ్లోబల్ క్వాలిటీ ఫోరమ్‌లు దీనిలో పాల్గొన్నాయి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







