ఆ సీనియర్ డైరెక్టర్‌కి ఏంటీ కష్టాలు పాపం.!
- December 07, 2022
తమిళ డైరెక్టర్ బాల అంటే తెలుగులోనూ తెలియని వాళ్లుండరు. అప్పట్లో జాతీయ అవార్డు దక్కించుకున్న కొన్ని ప్రత్యేకమైన సినిమాలను తనదైన శైలిలో తెరకెక్కించిన గొప్ప దర్శకుడు బాల.
అలాంటి దర్శకుడికి ఇప్పుడు గడ్డు పరిస్థితి వచ్చింది. ఈయన డైరెక్షన్లోనే స్టార్ హీరోలైన విక్రమ్, సూర్య వంటి హీరోలు సైతం బాలకు హ్యాండివ్వడం ఇప్పుడు తమిళ నాటే కాదు, తెలుగు నాట కూడా హాట్ టాపిక్ అయ్యింది.
మొన్నామధ్య సీనియర్ హీరో విక్రమ్ తన తనయుడు ధృవ్‌ని పరిచయం చేసే బాధ్యతను బాల చేతుల్లో పెట్టాడు. తెలుగు అర్జున్‌రెడ్డిని ‘వర్మ’ టైటిల్‌తో ధృవ్ విక్రమ్ హీరోగా రూపొందించాడు బాల.
సినిమా మొత్తం పూర్తయిపోయాకా, లాస్ట్ మినిట్‌లో సినిమా బాగోలేదంటూ, విక్రమ్ బాలను పక్కన పెట్టేసి, గిరీశయ్య డైరెక్షన్లో మళ్లీ అదే సినిమాని టైటిల్ కూడా మార్చేసి తెరకెక్కించి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
అలా ఒకసారి బాలకి అవమానం జరిగిందంటే, ఇప్పుడు మళ్లీ అలాంటి అవమానకరమైన పరిస్థితినే ఎదుర్కోవాల్సి వచ్చింది డైరెక్టర్ బాలకి. తాజగా సూర్య హీరోగా బాల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సగం షూటింగ్ అయ్యాకా, సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఇష్యూతో డైరెక్టర్‌గా బాల, ఎందుకు ఇలా ఫెయిలవుతున్నాడు.? అని ఆయన అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సూర్య, ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడమనేది ఫ్రెండ్లీగానే జరిగిందని బాల ఓ నోట్ ద్వారా ఫ్యాన్స్‌కి క్లారిటీ ఇచ్చారు.
తాజా వార్తలు
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు
- ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ
- ఉగ్రవాదం పై రాజీ లేదు: ప్రధాని మోదీ
- కొత్త IT చట్టం రూల్స్
- బూతు రాజకీయాలు, పోలింగ్ బూత్‌లోనే సమాధానం: వెంకయ్య నాయుడు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్‌లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 11,656 మందిపై బహిష్కరణ వేటు..!!









