దుబాయ్ లో 132 వాహనాలు స్వాధీనం.. జరిమానా
- December 08, 2022
దుబాయ్: యూఏఈ 51వ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు దుబాయ్ పోలీసులు 132 వాహనాలను స్వాధీనం చేసుకొని వాటి యజమానులకు జరిమానా విధించారు. ట్రాఫిక్ కు అంతరాయం, వాహనాల రంగును మార్చడం, పర్మిట్ లేకుండా వారి వాహనాలను స్టిక్కర్లతో కప్పి ఉంచడం, కార్ల నుండి చెత్తను వేయడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, తమకు..ఇతరులకు ప్రమాదం కలిగించే ఉల్లంఘనలు ఉన్నాయని, అలాగే వాహనదారులపై బ్లాక్ పాయింట్లు కూడా విధించినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు బర్ దుబాయ్‌లో పెట్రోలింగ్ సిబ్బంది 4,697 మంది వాహనదారులకు జరిమానాలు విధించారని, అలాగే 72 వాహనాలను డీరాలో స్వాధీనం చేసుకున్నట్లు దుబాయ్ పోలీస్‌లోని ట్రాఫిక్ జనరల్ డిపార్ట్‌మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







