ఫిషింగ్ చట్టం ఉల్లంఘం: 22 మంది ప్రవాసులు బహిష్కరణ

- December 09, 2022 , by Maagulf
ఫిషింగ్ చట్టం ఉల్లంఘం: 22 మంది ప్రవాసులు బహిష్కరణ

మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్‌లోని మెరైన్ ఫిషింగ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇరవై ఇద్దరు ప్రవాసులను బహిష్కరించినట్లు వ్యవసాయ, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) తెలిపింది. అల్ వుస్తా గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ అగ్రికల్చర్, ఫిషరీస్ అండ్ వాటర్ రిసోర్సెస్‌లోని మత్స్య నియంత్రణ బృందం, రాయల్ ఒమన్ పోలీసు పోలీసుల సహకారంతో చేపట్టిన సంయుక్త తనిఖీల్లో మెరైన్ ఫిషింగ్ లా, లేబర్‌ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 22 మంది ప్రవాస కార్మికులను బహిష్కరించినట్లు వెల్లడించింది. మత్స్య నియంత్రణ బృందం, డుక్మ్ పోలీస్ స్టేషన్ సహకారంతో మెరైన్ ఫిషింగ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 46 మంది ప్రవాస కార్మికులను అరెస్టు చేసినట్లు తెలిపారు. అల్ వుస్తా గవర్నరేట్‌లో నవంబర్ 20 నుండి 30 వరకు 53 కార్మిక ఉల్లంఘనలను జారీ చేసిందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com