సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసిన కింగ్ సల్మాన్, చైనా అధ్యక్షుడు
- December 09, 2022
రియాద్: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్.. రియాద్‌లోని అల్-యమామా ప్యాలెస్‌లో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో విస్తృత చర్చలు జరిపారు. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ సమక్షంలో వారి చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో సౌదీ అరేబియా, చైనా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై రాజు సల్మాన్, అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సంతకం చేశారు. అంతకుముందు సౌదీ అరేబియాకు విచ్చేసిన చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ప్రతినిధి బృందానికి కింగ్ సల్మాన్ స్వాగతం పలికారు. సౌదీ అరేబియా, చైనా మధ్య చారిత్రక స్నేహం, వివిధ రంగాలలో స్నేహపూర్వక ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకుపోయే మార్గాలపై ఇరుదేశాధినేతలు సమీక్షించారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం జి జిన్‌పింగ్ బుధవారం రియాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన చైనా- సౌదీ సదస్సుతో పాటు రెండు శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొననున్నారు. గత ఆరేళ్లలో సౌదీ అరేబియాలో ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్ రెండో పర్యటన ఇది. రాజుతో చైనా అధినేత మొదటి సమావేశం 2016లో రియాద్‌లో జరిగింది. దీని తర్వాత 2017 మార్చిలో కింగ్ సల్మాన్ చైనాలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో సౌదీ రాష్ట్ర మంత్రి, కేబినెట్ సభ్యుడు, జాతీయ భద్రతా సలహాదారు డా. ముసేద్ అల్-ఐబాన్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు, CPC జనరల్ ఆఫీస్ డైరెక్టర్ డింగ్ జూజీయాంగ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







