30 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసి సౌదీ-చైనా

- December 09, 2022 , by Maagulf
30 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసి సౌదీ-చైనా

సౌదీ: సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్.. సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ Xiతో "సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం"పై సంతకం చేశారు. సుమారు 30 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేశారు. గ్రీన్ హైడ్రోజన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రవాణా, నిర్మాణంతో సహా రంగాలలో 34 పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. 110 బిలియన్ రియాల్స్ ($29.3 బిలియన్) విలువైన మరో 20 ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి ఉందని స్టేట్ బ్రాడ్‌కాస్టర్ అల్ ఎఖ్బరియా తెలిపారు. మరోవైపు ప్రతి రెండు సంవత్సరాలకు రెండు దేశాల మధ్య దేశాధినేతల సమావేశాన్ని నిర్వహించడానికి ఇరుదేశాధినేతలు అంగీకరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com