డిసెంబరు 14-15 తేదీల్లో యూఏఈలో భారీ ఉల్కాపాతం!
- December 09, 2022
యూఏఈ: ఈ ఏడాది చివరి ఉల్కాపాతం డిసెంబరు 14-15 రాత్రికి గరిష్ట స్థాయికి చేరుకోనున్నది. అత్యంత అద్భుతమైన ఉల్కాపాతాలతో ఆకాశం అబ్బురపరుస్తుందని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ ప్రకటించింది. నివాసితులు సంవత్సరంలో అతిపెద్ద , చివరి ఉల్కాపాతం(జెమినిడ్స్ ఉల్కాపాతం) వీక్షించే అవకాశం ఉంటుందని తెలిపారు.
జెమినిడ్స్ ఉల్కాపాతం అంటే ఏమిటి?
జెమినిడ్స్ ఉల్కాపాతంలో శిధిలాల ముక్కలు సెకనుకు 70 కిమీ వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. భూ వాతావరణంలోకి అవి ప్రవేశిస్తూనే అవి మండిపోతాయి. వాటినే ఉల్కలు అని పిలుస్తారు. అద్భుతమైన ఉల్కాపాతంలో గరిష్టంగా గంటకు 150 ఉల్కలను చూడవచ్చు. వాటిలో కొన్ని మాత్రమే అరుదుగా భూమిని చేరే అవకాశం ఉంటుంది.
ఎలా చూడాలి?
ఉల్కాపాతాన్ని వీక్షించేందుకు ప్రజలకు ఎలాంటి ప్రత్యేక పరికరాలు లేదా నైపుణ్యాలు అవసరం లేదని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ సీఈఓ హసన్ అల్ హరిరి తెలిపారు. కావలసిందల్లా స్వచ్ఛమైన ఆకాశం, సిటీ లైట్లకు దూరంగా ఉండే ప్రదేశం.
ఎక్కడ చూడొచ్చంటే?
దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ డిసెంబర్ 14న దుబాయ్‌లోని అల్ ఖుద్రాలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం రాత్రి 8 గంటల నుండి ఉదయం 12 గంటల వరకు జరుగుతుంది. అదేసమయంలో టెలిస్కోప్ ద్వారా చంద్రుడు, మార్స్, బృహస్పతి, శని గ్రహాలలను చూసే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







