ముస్లింయేతర ప్రవాసుల కోసం కొత్త చట్టం తెచ్చిన యూఏఈ
- December 10, 2022
యూఏఈ: ముస్లిమేతర విదేశీయులందరి వ్యక్తిగత హోదాపై ఫెడరల్ డిక్రీ చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు యూఏఈ ప్రకటించింది. యూఏఈలో వివాహం, విడాకుల చుట్టూ ఉన్న నిబంధనలు, విధానాలపై కొత్త చట్టం స్పష్టతను అందిస్తుందని వెల్లడించారు. ఫెడరల్ పర్సనల్ స్టేటస్ చట్టం 2023 ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి వస్తుందన్నారు. కొత్త డిక్రీ-లా ప్రకారం.. వివాహ పరిస్థితులను, కాంట్రాక్ట్ వివాహాన్ని సమర్థ న్యాయస్థానాల ముందు డాక్యుమెంట్ చేసే విధానాలను నియంత్రించవచ్చు. అలాగే వివాహంలో ఒకరు లేదా ఇద్దరు సభ్యులు విడాకులు తీసుకోవాలనుకుంటే అనుసరించాల్సిన ప్రక్రియను కూడా కొత్త డిక్రీ-లా సూచిస్తుంది. అంతేకాకుండా విడాకుల విచారణ సమయంలో చేసే ఏదైనా ఆర్థిక క్లెయిమ్‌లకు సంబంధించిన విధానాలను చట్టం నిర్దేశిస్తుంది. కొత్త ఫెడరల్ పర్సనల్ చట్టం యూఏఈలో విడాకుల తర్వాత పిల్లల ఉమ్మడి సంరక్షణ కోసం ఏర్పాట్లను నిర్వహిస్తుంది. ఫెడరల్ పర్సనల్ స్టేటస్ లా యూఏఈలో వారసత్వం, వీలునామా, పితృత్వ పరీక్షల రుజువు కోసం విధానాలను కూడా కొత్త చట్టం నిర్వహిస్తుందని యూఏఈ వెల్లడించింది.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్‌లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్‌లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







