బహ్రెయిన్‌కు చెందిన ‘గోల్డెన్ మ్యాన్’ అశోక్ శెట్టి కన్నుమూత
- December 11, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో ‘గోల్డెన్ మ్యాన్’గా ప్రసిద్ధి చెందిన అశోక్ శెట్టి కన్నుమూశారు. 42 సంవత్సరాలు బహ్రెయిన్ లో ఉన్న ఆయన అనారోగ్యం కారణంగా 2019లో ఇండియాకు తిరిగి వెళ్లిపోయారు. అనారోగ్యం కారణంగా అక్కడే చికిత్స పొందుతూ మరణించారు. శెట్టి బహ్రెయిన్‌లో క్రియేటివ్ అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషన్ కో వోల్ స్థాపకుడు. అతను జాతీయ దినోత్సవ బిల్‌బోర్డ్‌లను చేపట్టే ఏజెన్సీలో ఉన్నప్పుడు బహ్రెయిన్‌కు చెందిన దివంగత అమీర్, హెచ్‌హెచ్ షేక్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా పెయింటింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. డిసెంబర్ 1992లో ఆ పోర్ట్రెయిట్‌ను రూపొందించినట్లు అతను ఓ సందర్భంలో తెలిపారు. మిస్టర్ శెట్టి జూన్ 2018లో భారతదేశాని వెళ్లిన సమయంలో అధిక షుగర్ స్థాయి కారణంగా పక్షవాతానికి గురయ్యాడు. ఆ సంఘటన తర్వాత శెట్టి తన కుమారుడు అభిషేక్ శెట్టి, అతని భార్య వందనా అశోక్ శెట్టితో కలిసి చికిత్స కోసం భారతదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.
తాజా వార్తలు
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ
- SBI ఇన్సూరెన్స్ స్కీం: ₹3,000 ప్రీమియంతో ₹60 లక్షల ప్రమాద బీమా
- JEE మెయిన్ 2026 ఫైనల్ కీ విడుదల









