తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- December 11, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతుండగా తాజాగా మరో 7,029 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శనివారం (డిసెంబర్ 10,2022) సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు శాఖల్లో పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పోలీస్ శాఖకు సంబంధించి వివిధ భాగాల్లో 3,966 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కొత్త పోలీస్ స్టేషన్లు, సర్కిళ్లు, డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
ఆర్ అండ్ బీ శాఖలో 472 పోస్టుల భర్తీతోపాటు పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. చీఫ్ ఇంజినీర్ 3, సూపరింటెండెంట్ ఇంజినీర్ 12, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ 13, డీఈఈ 102, అసిస్టెంట్ ఈఈ 163, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ 28, టెక్నికల్, నాన్ టెక్నికల్ 151 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు రూ. 1,865 కోట్లు కేటాయించింది.
బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాసంస్థల్లోని పలు విభాగాల్లో 2,591 కొత్త ఉద్యోగ పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన 4 జూరియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 గురుకుల పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో నూతన నియామకాలను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల పని విధానంలో పలు సంస్కరణలు తీసుకురానుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







